విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో శనివారం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ తోపాటు, విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు. విమానాశ్రయంలోని 28వ రన్‌వేను వెంటనే మూసివేశారు.
అధికారుల అప్రమత్తంతో 161 మంది ప్రయాణికులతో వెళ్తున్న విశాఖపట్నం-ఢిల్లీ విమానం శనివారం (మార్చి 28) ఉదయం 11 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిది. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానం ఉదయం 10.53 గంటలకు అత్యవసరంగా కిందకు దిగింది. విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. పోలీసులు, ఎయిర్ పోర్టు సిబ్బంది, అగ్నిమాపక వాహనాలను కూడా ఘటనా స్థలానికి పంపించారు. చివరికి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news