యూరప్‌ను వణికిస్తున్న అసాధారణ వేసవి హీట్‌వేవ్ కారణంగా వందలాది అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జూన్ ఇరవై నుంచి యూరప్‌లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికులు ఈ వేడి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోనే సుమారు వెయ్యి అదనపు మరణాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ యూరప్‌లో వేడి ప్రమాదం వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన తీవ్రమైన హీట్‌వేవ్‌లు ఇప్పుడు తరచుగా వస్తున్నాయని, యూరప్ ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా వేడెక్కుతోందని ఆయన గుర్తుచేశారు. అధిక వేడి కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, నీరసం, వడదెబ్బ, మూత్రపిండాల సమస్యలు వంటి ప్రాణాంతక ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news