1ఐరోపా దేశాలను వేడిగాలుల తీవ్రత కుదిపేస్తోంది. పశ్చిమ ఐరోపాను వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఉష్ణతరంగం ఇప్పుడు మధ్య, తూర్పు ఐరోపా వైపు కదులుతూ జర్మనీ, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్ సహా అనేక దేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలుకొట్టింది. జర్మనీలో సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలోని మోకెర్న్-డ్రెవిట్జ్లో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు జర్మనీ వాతావరణ సేవ ప్రాథమికంగా తెలిపింది. ఇది అంతకుముందు రోజే సార్బ్రూకెన్ సమీపంలో నమోదైన 41.3 డిగ్రీల రికార్డును మించిందని నివేదికలు చెబుతున్నాయి.
డెన్మార్క్‌లో కూడా దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఓడుమ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. చెక్ రిపబ్లిక్లో డోక్సానీ ప్రాంతం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతను చూసింది. ఆ దేశంలో ఇంతకుముందు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డును ఇది అధిగమించినట్లు స్థానిక వాతావరణ సంస్థలు తెలిపాయి
Fetching videos...
Fetching latest news...
No trending news