భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఫీజు రాయితీ అమలు చేయాలని సామాజిక సేవకుడు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షకుడు కర్నే బాబురావు జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అమలవుతున్న విధానాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అమలు చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా కర్నే బాబురావు మాట్లాడుతూ, ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే పెరుగుతున్న విద్యా వ్యయాల కారణంగా జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, వారి పిల్లలకు సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే ఆదేశాలు జారీ చేసి, అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు పూర్తి ఫీజు రాయితీ అమలు చేయాలని కోరారు. అలాగే ఆరోగ్య బీమా, టీఎస్ఆర్టీసీ ఉచిత లేదా రాయితీ బస్సు ప్రయాణం, రైల్వే ప్రయాణ రాయితీలు, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అమలవుతున్న జర్నలిస్టుల సంక్షేమ చర్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అమలు చేయాలని, ఈ అంశంపై జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కర్నే బాబురావు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news