ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ అత్యంత కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ, రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 పోటీలు ముగియడంతో ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్, గ్రాండ్ ఫైనల్‌పైనే నిలిచింది. ప్రతి మ్యాచ్ ఇప్పుడు 'డూ ఆర్ డై'గా మారింది. ఒక్క పరాజయం జట్టును టోర్నీ నుంచి నిష్క్రమింపజేస్తే, విజయం సెమీస్ లేదా ఫైనల్‌కు తీసుకెళ్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లతో పాటు మొరాకో, నార్వే, స్విట్జర్లాండ్ వంటి ఆశ్చర్యకర ప్రదర్శన చేసిన జట్లు కూడా టైటిల్ రేసులో నిలిచాయి.
క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్, మొరాకో తలపడనున్నాయి. ఆ తర్వాత స్పెయిన్–బెల్జియం మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. మూడో క్వార్టర్ఫైనల్లో నార్వే, ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చివరి క్వార్టర్ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, చారిత్రాత్మక విజయంతో ముందుకొచ్చిన స్విట్జర్లాండ్‌తో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల విజేతలు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
సెమీఫైనల్స్ జూలై 14, 15 తేదీల్లో జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్–మొరాకో విజేత, స్పెయిన్–బెల్జియం విజేతతో తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో నార్వే–ఇంగ్లండ్ విజేత, అర్జెంటీనా–స్విట్జర్లాండ్ విజేతతో పోటీ పడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంటాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news