రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా చేనేత (హ్యాండ్లూమ్) మరియు పవర్ లూమ్ రంగాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
పథకం ప్రకారం పవర్ లూమ్ శ్రామికులకు నెలకు 500 యూనిట్ల వరకు, చేనేత శ్రామికులకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితంగా అందించబడుతుంది. దీంతో చిన్న స్థాయి నేతన్నలు, గృహ ఆధారిత చేనేత వృత్తిదారులు, పరిమిత వనరులతో పనిచేస్తున్న పవర్ లూమ్ యూనిట్ల నిర్వాహకులు ఆర్థికంగా లాభపడతారు.
ఈ పథకం ద్వారా పవర్ లూమ్ కుటుంబాలకు నెలకు సుమారు రూ.2000 నుంచి రూ.2200 వరకు, చేనేత కుటుంబాలకు నెలకు సుమారు రూ.700 నుంచి రూ.800 వరకు ఆదా అవుతుందని అంచనా. ఈ విధంగా ఉచిత విద్యుత్ పథకం నేతన్నలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి జీవనోపాధిని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news