విజయనగరం కలెక్టరేట్లో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గిరిజన గ్రామాల రహదారులు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అటవీ శాఖ అనుమతులు ఆలస్యమవడం వల్ల రోడ్డు పనులు నిలిచిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇళ్ల స్థలాల పంపిణీలో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరగా, కలెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు పంపించామని త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు హోంమంత్రి అనిత చేతుల మీదుగా తాళాలు అందజేశారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news