గోకవరం మండలం భావాజీపేట లేఅవుట్ కాలనీలో వృద్ధులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
శ్రీ లలిత మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి. చిన్ని కుమార్తె లలిత వీరవేణి 11వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు గొడుగులు అందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఎంపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, పి. దేవానందం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి డాక్టర్ జి. మహాలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు, వృద్ధులకు సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు సహాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ గోకవరం మండల నాయకులు, సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులకు అందించిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news