కృత్రిమ మేధ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న వేళ గూగుల్, మెటాకు సంబంధించిన కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మెటా సంస్థ జెమినీ కృత్రిమ మేధ నమూనాలను వినియోగించడంపై గూగుల్ పరిమితులు విధించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం మెటా కోరినంత స్థాయిలో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని గూగుల్ అందించలేకపోవడమేనని నివేదికలు పేర్కొన్నాయి.
నివేదికల ప్రకారం, ఈ పరిమితులు మార్చి నెల నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. జెమినీ ఆధారంగా చేపడుతున్న కొన్ని అంతర్గత కృత్రిమ మేధ ప్రాజెక్టులు దీనివల్ల ఆలస్యమయ్యాయని సమాచారం. గూగుల్ మౌలిక వసతులపై భారీ ఒత్తిడి ఏర్పడటంతో మెటా సహా పలువురు వినియోగదారులకు పూర్తి స్థాయిలో కంప్యూటింగ్ వనరులు అందించడం సాధ్యం కాలేదని పేర్కొంది
ఈ పరిస్థితుల నేపథ్యంలో మెటా తన ఉద్యోగులకు కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. అవసరమైన చోట మాత్రమే కంప్యూటింగ్ వనరులను వినియోగించాలని, అనవసరంగా వనరులు ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గతంగా సూచనలు జారీ చేసినట్లు నివేదికలు తెలిపాయి. ఇదే సమయంలో భవిష్యత్తులో బాహ్య సేవలపై ఆధారాన్ని తగ్గించి, స్వంత కృత్రిమ మేధ నమూనాల వినియోగాన్ని పెంచే దిశగా మెటా అడుగులు వేస్తోందని సమాచారం.Fetching videos...
Fetching latest news...
No trending news