గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్ మంచిదా, యోగా బెటరా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే కార్డియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటినీ పోల్చడం కంటే కలిపి చేయడమే ఉత్తమం. జిమ్లో చేసే కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు గుండె కండరాలను బలపరచడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచి గుండెజబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మరోవైపు యోగా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. శ్వాస సామర్థ్యం, శరీర సౌలభ్యం, నిద్ర నాణ్యతను మెరుగుపరచి గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే గుండె ఆరోగ్యానికి జిమ్ లేదా యోగాలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా రెండింటినీ ఫిట్నెస్ దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news