బాపట్ల జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన తిరంగా ర్యాలీలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, యువమోర్చా సభ్యులు, కార్యకర్తలు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో చీరాల పట్టణం దేశభక్తి వాతావరణాన్ని తలపించింది.
శ్రీ మేధావి కాలేజీ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ చీరాల పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా కొనసాగింది. శ్రీ మేధావి, చైతన్య భారతి కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 అడుగుల భారీ మువ్వన్నెల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు మువ్వల వెంకటరమణ రావు, జిల్లా బీజేపీ ఇన్చార్జి గాజుల వెంకయ్య నాయుడు, తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ మామిడాల రమేష్ సూచనలతో బాపట్ల యువజన మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయవాదులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ర్యాలీ సందర్భంగా పాల్గొన్న వారు దేశభక్తి నినాదాలు చేస్తూ, జాతీయ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో చీరాల వీధుల్లో దేశభక్తి సందడి కనిపించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి గర్వానికి, స్వాభిమానానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
నాశిన మణికుమార్, క్షత్రియ సుహాసిని బాయి, డాక్టర్ తాడివలస దేవరాజు తదితరులు మాట్లాడుతూ జాతీయ పతాకం పట్ల ప్రతి ఒక్కరిలో గౌరవ భావన పెంపొందించాలని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ భావాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ మేధావి కాలేజీ, చైతన్య భారతి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు, అభిమానులు, దేశభక్తులకు హర్ ఘర్ తిరంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్షత్రియ సుహాసిని బాయి, సయీద్ సబిర్ బెగ్, లావణ్య పల్లెల, పోతుల ప్రకాష్, డాక్టర్ తాడివలస దేవరాజు, నాశిన మణికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో తిరంగా ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది.
Fetching videos...
Fetching latest news...
No trending news