ప్రొటీన్ శరీర ఎదుగుదల, కండరాల బలం మరియు రోగనిరోధక శక్తికి అత్యంత అవసరమైన పోషకం. సాధారణంగా ఒక గుడ్డు ద్వారా సుమారు 6–7 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అయితే గుడ్లు తినని శాకాహారులకు కూడా అధిక ప్రొటీన్ అందించే అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ప్రకృతిలో ఉన్నాయి.
అందులో ముఖ్యంగా శనగలు (Chickpeas) అత్యంత శక్తివంతమైనవి. ఒక కప్పు ఉడికించిన శనగల్లో సుమారు 15 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అదే విధంగా క్వినోవా (Quinoa) కూడా పూర్తి ప్రొటీన్‌గా పరిగణించబడుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని అమినో యాసిడ్లు ఉంటాయి.
గుమ్మడి గింజలు (Pumpkin seeds) కూడా మంచి ప్రొటీన్ వనరుగా పనిచేస్తాయి. కేవలం 28 గ్రాముల్లోనే సుమారు 8.5 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అలాగే పనీర్ (Paneer) మరియు టోఫు (Tofu) కూడా శాకాహారులకు బెస్ట్ ఆప్షన్లు. 100 గ్రాముల పనీర్ లేదా టోఫులో 14–18 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది.
ఈ 5 ఆహారాలను డైట్లో చేర్చుకుంటే గుడ్లపై ఆధారపడకుండా కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను సులభంగా పొందవచ్చు.
Fetching videos...
Fetching latest news...
No trending news