HomeHealthలీటరు పాలతో ఎంత పనీర్ వస్తుంది..? పూర్తి వివరాలు ఇ..
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుంది..? పూర్తి వివరాలు ఇవే!
Updated 59 days ago
ఇంట్లోనే సాఫ్ట్ పనీర్ తయారీ విధానం
ఇంట్లో పనీర్ తయారు చేయడం చాలా సులభం. కేవలం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు.
స్టెప్ 1: పాలు మరిగించడం
మొదట ఒక లీటరు ఫుల్ క్రీమ్ పాలను గిన్నెలో వేసి బాగా మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద కాలే అవకాశం ఉంటుంది.
స్టెప్ 2: విరగ్గొట్టడం
పాలు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి, నిమ్మరసం లేదా వెనిగర్‌ను కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొద్ది సేపట్లోనే పాలు విరిగి పనీర్ ముక్కలు వేరవుతాయి.
స్టెప్ 3: వడకట్టడం
ఒక జల్లెడపై పలుచని కాటన్ వస్త్రాన్ని వేసి, విరిగిన పాలను అందులో పోయాలి. నీరు పూర్తిగా వడకట్టాలి.
స్టెప్ 4: శుభ్రం చేయడం
నిమ్మరసం లేదా వెనిగర్ వాసన పోవడానికి చల్లటి నీటితో పనీర్‌ను ఒకసారి కడగాలి.
స్టెప్ 5: ఆకారం ఇవ్వడం
వస్త్రాన్ని బాగా మూటకట్టి, పై నుంచి బరువు పెట్టాలి. సుమారు 20–30 నిమిషాలు ఉంచితే పనీర్ గట్టిగా, ముక్కలుగా కోయడానికి వీలుగా తయారవుతుంది.
ఇంట్లో తయారైన పనీర్‌లో ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇది అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం కావడంతో కండరాల పెరుగుదలకు, ఎముకల బలానికి సహాయపడుతుంది. పిల్లలు, యువత, జిమ్ చేసే వారు దీనిని క్కువగా తీసుకుంట