HomeSportsహైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ధాటికి మెదక్ విలవిల.. 200+ ..
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ధాటికి మెదక్ విలవిల.. 200+ స్కోర్
Updated 2 days ago
టీజీ20 లీగ్‌లో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బ్యాటర్లు మెదక్ ఫాల్కన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన మెదక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నా, హైదరాబాద్ బ్యాటర్లు ఆ అవకాశాన్ని ఏమాత్రం వదల్లేదు. ఓపెనర్లు జట్టుకు వేగవంతమైన ఆరంభం అందించగా, సాయి వికాస్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీకి చేరువయ్యాడు. 11 ఓవర్లకే జట్టు 142 పరుగులు చేయడంతో భారీ స్కోర్‌కు బలమైన పునాది పడింది. అనంతరం వికాస్ రెడ్డి 93 పరుగుల వద్ద ఔటైనా అప్పటికే హైదరాబాద్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మధ్యలో వరుస వికెట్లు పడినా, అరవింద్ సిక్సర్లతో మెదక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 16.3 ఓవర్లకే హైదరాబాద్ 200 పరుగుల మార్క్‌ను దాటేసి ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. ఈ ఇన్నింగ్స్‌తో టీజీ20 లీగ్‌లో మరో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనను నమోదు చేసింది.