HomeSportsహ్యాట్రిక్ విజయమే లక్ష్యం.. మెదక్‌తో హైదరాబాద్ కీల..
హ్యాట్రిక్ విజయమే లక్ష్యం.. మెదక్‌తో హైదరాబాద్ కీలక పోరు
Updated 2 days ago
తెలంగాణ టీ20 లీగ్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ శనివారం మెదక్ ఫాల్కన్స్‌తో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాలమూరు, రంగారెడ్డి జట్లపై అద్భుత విజయాలు నమోదు చేసిన హైదరాబాద్, ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధాన బలంగా మారింది. గత మ్యాచ్‌లో 45 బంతుల్లో 99 పరుగులతో మ్యాచ్‌ను మలిచిన అతడిపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. గణేశ్ కూడా నిలకడగా రాణిస్తుండగా, అన్విత్, సాయి వికాస్ రెడ్డి వంటి బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే స్పిన్ ఆల్‌రౌండర్ యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 జట్టులో ఎంపిక కావడంతో హైదరాబాద్‌కు అందుబాటులో లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బ. మరోవైపు గత ఓటమి నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని మెదక్ ఫాల్కన్స్ పట్టుదలగా ఉంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ పోరులో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక మెదక్ షాక్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.