విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో అవకతవకలు వెలుగుచూశాయి. సిబ్బంది బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్‌గా మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనతో ఆలయ పరిపాలనలో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తనిఖీలలో సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news