విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో “2 ఏళ్ల నమ్మకం - ఇంటింటికి సంక్షేమం” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
57వ డివిజన్లో టీడీపీ నాయకులు, మహిళా నేతలు కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విజయాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల విశ్వాసమే ప్రధాన బలమని నాయకులు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ పనితీరును ప్రతి ఇంటికీ చేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు. ప్రజల నుంచి ఈ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కబీర్, లీలావతి, శృతి, ఉషారాణి, గీత, రేణుక, ఉపేంద్ర, సరోజిని తదితరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news