అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి దిశగా కొత్త ఒప్పందం కుదిరిన మరుసటి రోజే దక్షిణ లెబనాన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకారం, దక్షిణ లెబనాన్‌లోని నబతియెహ్ అల్ ఫవ్ఖా పట్టణంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరగడంతో ఒకరు మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తమ దళాలకు ముప్పుగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. అయితే ఒప్పందం కుదిరిన వెంటనే దాడు వాషింగ్టన్లో కుదిరిన ఈ కొత్త భద్రతా రూపురేఖలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు “చారిత్రాత్మక ఒప్పందం”గా అభివర్ణించారు. ఆయన మాటల్లో, ఇది ఇరాన్, హిజ్బుల్లాకు వ్యూహాత్మక దెబ్బ. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దక్షిణ లిటాని ప్రాంతం నుంచి దశలవారీగా బలగాలను ఉపసంహరించుకోవాలి. ఖాళీ అయ్యే ప్రాంతాలపై లెబనాన్ సైన్యం ప్రత్యేక నియంత్రణ చేపట్టాలి. అయితే ఇజ్రాయెల్ బలగాలకు దక్షిణ లెబనాన్‌లో విస్తరించిన భద్రతా మండలంలో తాత్కాలికంగా ఉండే అవకాశం కూడా కల్పించబడింది. లు జరగడం వల్ల ఆ ఒప్పందం నిలబడుతుందా అన్న అనుమానాలు పెరిగాయి
ఈ ఒప్పందాన్ని హిజ్బుల్లా తీవ్రంగా తిరస్కరించింది. ఆ సంస్థ నాయకుడు నైమ్ ఖాసిమ్ ఈ ఒప్పందాన్ని లెబనాన్ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచే చర్యగా విమర్శించారు. హిజ్బుల్లా ఈ చర్చల్లో భాగస్వామి కాలేదు. అయినప్పటికీ ఒప్పందంలో హిజ్బుల్లా నిరాయుధీకరణ అంశం కీలకంగా ఉండటం ఆ సంస్థ ఆగ్రహానికి కారణమైంది. ఖాసిమ్ ఈ ఒప్పందాన్ని చెల్లనిదిగా పేర్కొంటూ, లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ప్రమాదకరమైన రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు.
లెబనాన్‌లోని షియా వర్గాల్లో కూడా ఈ ఒప్పందంపై అసంతృప్తి కనిపిస్తోంది. అమల్ ఉద్యమం సహా కొన్ని వర్గాలు ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రయోజనాలకు దగ్గరగా ఉందని విమర్శిస్తున్నాయి. యుద్ధం, దాడులు, సైనిక కదలికల కారణంగా లక్షలాది మంది లెబనాన్ ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ భద్రతా మండలంలో కొనసాగేందుకు అనుమతి ఇవ్వడం, స్థానికుల తిరుగు ప్రయాణంపై అనిశ్చితి కలిగించడం మరింత ఆందోళనకు దారి తీస్తోంది
Fetching videos...
Fetching latest news...
No trending news