పాలకొండలోని జగన్నాథ స్వామివారి ఆలయంలో నేటి నుంచి రథోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారి వివిధ అవతార దర్శనాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న తొలిదశమి కార్యక్రమంతో ప్రారంభమై, 17న ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. 18న మత్స్యావతారం, 19న కూర్మావతారం, 20న వరాహ నరసింహస్వామి అవతారం, హీరాపంచమి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
21న వామన, పరశురామ అవతారాలు, 22న రామ, బలరామ అవతారాలు, 23న కల్కి, జగన్మోహిని అవతారాల దర్శనం భక్తులకు కల్పించనున్నారు. 24న మారుదశమి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది.
25న తిరుగు రథయాత్ర నిర్వహించనుండగా, 26న జగన్నాథ స్వామివారు ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించడంతో ఉత్సవాలు ముగియనున్నాయి. రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news