రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మేగావత్ మంగ్లా నాయక్ తల్లి పికిలి బాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె నరసరావుపేటలోని సాయి తిరుమల ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పికిలి బాయిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందేలా వైద్యులతో మాట్లాడారు. ప్రమాదం కారణంగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.
పికిలి బాయి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శతో బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news