దుత్తలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత పటిష్ఠం చేసేలా సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు, కార్యకర్తలు ముందుండాలని కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దుత్తలూరు మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.5,54,491 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంపిణీ చేశారు. వైద్య ఖర్చులకు అందిన ఈ సహాయంపై లబ్ధిదారులు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news