భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌పై మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ స్పోర్ట్స్ పోడ్కాస్ట్లో పాల్గొన్న కపిల్ దేవ్ ఈ అంశంపై హుందాగా స్పందించారు. తన మనసులో యోగరాజ్ సింగ్‌పై ఎలాంటి ద్వేషం లేదని, ఇప్పటికీ అతడిని స్నేహితుడిగానే భావిస్తానని స్పష్టం చేశారు. అయితే జీవితాన్ని ద్వేషంతో గడిపే వ్యక్తులకు మాత్రం తాను దూరంగా ఉంటానని పేర్కొన్నారు. కఠిన స్వభావం కలిగిన వారితో సన్నిహితంగా ఉండడం తనకు ఇష్టం లేదని చెప్పిన కపిల్, పగ కంటే ప్రశాంతమైన జీవితం ముఖ్యమని సూచించారు.
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ గురించి కూడా కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్‌కు యువరాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని, రెండు ప్రపంచకప్‌లలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం గొప్ప ఘనత అని అన్నారు. అలాంటి కొడుకు ఉన్నందుకు యోగరాజ్ గర్వపడాలని, గతంలోని పాత విభేదాలను పట్టుకుని జీవితాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. విజయాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే నిజమైన ఆనందమని ఆయన అభిప్రాయపడ్డారు.
జీవితంలో ప్రతి ఒక్కరికీ అన్నీ దక్కవని, యోగరాజ్‌కు భారత్ తరఫున ఆడే అవకాశం రావడంతో పాటు సినీ రంగంలో కూడా గుర్తింపు లభించిందని కపిల్ గుర్తు చేశారు. ఒకవేళ యోగరాజ్ తనను కౌగిలించుకోవడానికి వచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పెద్ద మనసుతో వ్యాఖ్యానించారు. ఇద్దరూ ఒకే కోచ్ వద్ద శిక్షణ పొందిన విషయాన్ని గుర్తుచేసిన కపిల్, పాత అనుబంధాలను మరచిపోకుండా సానుకూల దృక్పథంతో జీవించాలని సూచించారు. ఆయన హుందాతనంతో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news