కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 57వ జన్మదినం సందర్భంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి సైన్యం సోషల్ మీడియా రాష్ట్ర జాతీయ కార్యదర్శి కొలి పాక శ్రీనివాస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్య సమరంలో నుంచి ఆధునిక భారత నిర్మాణం వరకు చేసిన సేవలను గుర్తు చేస్తూ, దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతూ దేశ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం కీలకమని కొలి పాక శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజలకు చేరువైన పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మేలు చేస్తున్నాయని వివరించారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ఆర్థికాభివృద్ధికి చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధార్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడడంలో ఆ విధానం కీలకంగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేసిందని, భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలపడుతుందని, ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు మరింత ఆదరణ లభిస్తుందని కొలి పాక శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news