కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం గ్రామంలోని 8వ వార్డులో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఉల్లిగయ్య, మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కౌతాళం గ్రామంలోని 8వ వార్డు ఎస్సీ కాలనీతో పాటు సచివాలయం కార్యాలయ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అల్లూరు వెంకటపతి రాజు పాల్గొని ప్రజలకు ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై వివరించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు సక్రమంగా ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరు వెంకటపతి రాజు తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో ముఖ్యమైనదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సమయంలో ఓటు వినియోగించుకోవాలంటే ముందుగానే ఓటర్ వివరాలను తనిఖీ చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బూత్ నంబర్లు 163, 166, 167 పరిధిలో ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు గడువు సమీపించిందని, కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ప్రజలకు తెలియజేశారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఓటర్ జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌతాళం టౌన్ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజబాబు, బీజేపీ కౌన్సిల్ సభ్యులు విజయ్, తెలుగు యువత నాయకులు గొట్టయ్య, బీఎల్వోలు మైత్రిలి మేడం, అబ్దుల్ సార్, ఆశా కార్యకర్తలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు ఓటర్ వెరిఫికేషన్‌పై పూర్తి అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news