క్రికెట్ బెట్టింగ్, జూదం, గంజాయి వంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కృష్ణా జిల్లా పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించి ప్రజల సహకారంతో అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.
9440904702 నంబర్ ద్వారా ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. బెట్టింగ్, పేకాట, కోడిపందాలు, గంజాయి రవాణా, విక్రయం వంటి నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత ఆరు నెలల్లో జిల్లావ్యాప్తంగా జూదం, గంజాయి దాడుల్లో వందలాది కేసులు నమోదు చేసి, వేలాది మంది నిందితులను పట్టుకుని భారీగా నగదు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news