కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వరమనూరు గ్రామంలో చాలా కాలంగా కొనసాగుతున్న శ్మశాన వాటిక స్థల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించిన నాయకులు, ప్రజాప్రతినిధులు అనువైన స్థలాన్ని పరిశీలించి శ్మశాన వాటిక కోసం భూమిని గుర్తించారు.
వరమనూరు గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ శ్మశాన స్థలం లేకపోవడంతో గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి అనువుగా ఉండే భూమిని గుర్తించి శ్మశాన వాటిక కోసం కేటాయించే దిశగా చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్థుల చిరకాల సమస్యకు పరిష్కారం లభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానికులు నాయకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ క్లస్టర్ ఇంచార్జ్ మహేంద్ర బాబు, నియోజకవర్గ ఐటీడీపీ బాలాజీ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక స్థల సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news