కుప్పం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గాన్ని గురువారం జరిగిన కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా అస్గర్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఉమ్మర్, లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా భూపతి, కోశాధికారిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాసుల రెడ్డి, కృష్ణంరాజు, శివా రాయల్, మురళిలను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కే.ఎన్. ప్రసాద్, నాగరాజు, గోకుల్ కుమార్, మణి, సలహాదారులుగా మహదేవన్, రజనీకాంత్‌లను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా తేజ, పవన్, కిరణ్, ప్రభాకర్లకు బాధ్యతలు అప్పగించారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అస్గర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని కోరారు.
కమిటీ సమావేశానికి హాజరైన జర్నలిస్టులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల దుండగుల చేతిలో మృతి చెందిన సహచర పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి విలేకరి వి. కోట జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి కోసం సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం లక్ష్యంగా కొత్త కమిటీ పనిచేస్తుందని సభ్యులు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జర్నలిస్టుల ఐక్యతను పెంపొందిస్తూ వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news