మచిలీపట్నం: ‘ప్రశ్న రావణ్’ కేసులో దర్యాప్తు గడువును కృష్ణా జిల్లా కోర్టు మరో 30 రోజులు పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిందితుడు రావణ్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 90 రోజుల దర్యాప్తు గడువు రేపటితో ముగియనుండటంతో గడువు పొడిగించాలని దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌ను పరిశీలించిన కృష్ణా జిల్లా కోర్టు దర్యాప్తు అధికారులకు మరో 30 రోజుల గడువును మంజూరు చేసింది. దీంతో కేసు దర్యాప్తును కొనసాగించేందుకు అధికారులకు అదనపు సమయం లభించింది. 90 రోజుల గడువు ముగియనున్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం వెలువడింది.
Fetching videos...
Fetching latest news...
No trending news