మహానంది పుణ్యక్షేత్రంలో మహానందీశ్వర స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించగా మొత్తం రూ.32,29,396 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో ఎన్. శ్రీనివాస రెడ్డి తెలిపారు. 31 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
వివరాల ప్రకారం ప్రధాన హుండీ ద్వారా రూ.31,91,727, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.22,986, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.14,683 ఆదాయం వచ్చింది. భక్తుల విశ్వాసానికి ఇది నిదర్శనమని, ఆలయ అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తామని అధికారులు తెలిపారు.
మహానంది ఆలయంలోని అభిషేక మండపంలో నిర్వహించిన ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరఫున గ్రూప్ టెంపుల్ ఈవో ఏ. నాగప్రసాద్, ఏఈఓ మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి సేవకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news