మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముంబైతో పాటు పాల్ఘర్, రాయగడ్ జిల్లాల్లో కురిసిన రికార్డు స్థాయి వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మహారాష్ట్ర శాసన మండలి సమావేశాలను రోజంతా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల భద్రత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.
ముంబై నగరంలో అనేక ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేసి, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.
Fetching videos...
Fetching latest news...
No trending news