గుడిపల్లి మండలం సొడిగానిపల్లి పంచాయితీ మల్దేపల్లి గ్రామంలో రైతులకు 50% సబ్సిడీతో చాఫ్ కట్టర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాజు పాల్గొని రైతులకు పరికరాలను అందజేశారు.
కూటమి ప్రభుత్వం మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం అమలు చేస్తున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతుల ఉత్పాదకతను పెంచే దిశగా ఇలాంటి సబ్సిడీ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news