రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించే జీరో పవర్టీ పీ4 (పేదరిక నిర్మూలన) కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
జిల్లా అధికారులతో కలిసి పథకం అమలు తీరు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యాలను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news