అమెరికాలో ఐరన్ లంగ్‌పై ఆధారపడి జీవించిన చివరి పోలియో బాధితురాలు మార్థా లిల్లార్డ్ కన్నుమూశారు. ఆమె మరణంతో వైద్య చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసినట్లైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పోలియో రోగులకు ప్రాణాధారంగా నిలిచిన ఐరన్ లంగ్ యంత్రాన్ని జీవితాంతం ఉపయోగించిన చివరి అమెరికన్‌గా మార్థా లిల్లార్డ్ గుర్తింపు పొందారు. ఆమె 78 ఏళ్ల వయసులో జూన్ 26న ఓక్లహోమాలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు
మార్థా లిల్లార్డ్కు 1953లో, ఐదేళ్ల వయసులో పోలియో సోకింది. ఆ సమయంలో పోలియో అమెరికాలో అత్యంత భయంకరమైన వ్యాధులలో ఒకటిగా ఉండేది. వైరస్ కారణంగా ఆమె శరీరం తీవ్రంగా పక్షవాతానికి గురికాగా, స్వయంగా శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. దీంతో ఆమెను ఐరన్ లంగ్ అనే ప్రత్యేక శ్వాస యంత్రంలో ఉంచి చికిత్స అందించారు. ఈ భారీ లోహపు యంత్రం గాలి పీడనాన్ని మార్చడం ద్వారా ఊపిరితిత్తులు పనిచేసేలా చేసి రోగికి శ్వాస అందించేది. అప్పటి నుంచి జీవితాంతం ఆమె అదే యంత్రంపై ఆధారపడాల్సి వచ్చింది.
వైద్యులు ఆమె 20 ఏళ్లకు మించి బతకడం కష్టమని అప్పట్లో చెప్పినప్పటికీ, మార్థా అసాధారణ ధైర్యసాహసాలతో ఆ అంచనాలను తప్పుబట్టారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే 78 ఏళ్ల వరకు జీవించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ జీవితాన్ని ఆస్వాదించాలని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోకూడదని ఆమె తన జీవితం ద్వారా నిరూపించారు
Fetching videos...
Fetching latest news...
No trending news