మెక్సికోలో ప్రతి సంవత్సరం జరిగే ఒక వినూత్న సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడి ఒక పట్టణ మేయర్ ప్రతి ఏడాది ఆడ కైమాన్ (చిన్న జాతి మొసలి)తో ప్రతీకాత్మకంగా వివాహం చేసుకుంటారు. ఇది సాధారణ వివాహం కాదు, దాదాపు 230 సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ ఆచారం. స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం ఈ వేడుక సమాజానికి శాంతి, సుభిక్షం, మంచి వర్షాలు, సమృద్ధిగా చేపల వేట, వ్యవసాయాభివృద్ధిని తీసుకువస్తుందని నమ్ముతారు.
ఈ ప్రత్యేక వేడుక మెక్సికోలోని ఒఆక్సాకా రాష్ట్రంలోని సాన్ పెడ్రో హువామెలులా పట్టణంలో ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీ జాతులు శతాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. స్థానిక పురాణాల ప్రకారం, రెండు వేర్వేరు ఆదివాసీ తెగల మధ్య శాంతి ఒప్పందానికి ప్రతీకగా ఈ వివాహ ఆచారం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
వివాహానికి ముందు ఆడ కైమాన్ను సంప్రదాయ పద్ధతిలో అలంకరిస్తారు. తెల్లని పెళ్లి దుస్తులు, రంగురంగుల అలంకరణలు, పూల హారాలతో దానిని అందంగా తీర్చిదిద్దుతారు. భద్రతా కారణాల దృష్ట్యా కైమాన్ నోరును మృదువైన వస్త్రంతో కట్టేస్తారు, తద్వారా వేడుకలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అనంతరం స్థానిక సంగీతం, నృత్యాలు, సాంప్రదాయ ఊరేగింపుల మధ్య కైమాన్ను పట్టణమంతా తీసుకెళ్తారు.
Fetching videos...
Fetching latest news...
No trending news