అమెరికాలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటైన హ్యాంప్టన్స్ మరోసారి ప్రపంచ ధనవంతులు, సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ రూబిన్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక వైట్ పార్టీ అనంతరం, పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు సమీపంలోని 45 మిలియన్ డాలర్ల (సుమారు రూ.387 కోట్లకు పైగా) విలువైన ఓ అద్భుతమైన సముద్రతీర భవనాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఈ విలాసవంతమైన భవనం న్యూయార్క్‌లోని బ్రిడ్జ్హ్యాంప్టన్లో 15 డ్యూన్ రోడ్ వద్ద ఉంది. మైఖేల్ రూబిన్ నివాసానికి కేవలం నాలుగు ఇళ్ల దూరంలోనే ఉన్న ఈ ప్రాపర్టీ సముద్ర తీరాన విస్తరించి ఉండటంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది. పార్టీకి వచ్చిన అతిథుల్లో న్యూయార్క్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ వంటి నగరాలకు చెందిన పలువురు ధనికులు ఈ భవనాన్ని ప్రత్యక్షంగా సందర్శించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం సుమారు 7,059 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు అంతస్తుల భవనం 2018లో నిర్మితమైంది. మొత్తం 1.91 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో ఏడు విశాలమైన పడకగదులు, ఏడు బాత్రూమ్లు, రెండు పౌడర్ రూమ్‌లు, అత్యాధునిక వంటగది, భారీ లివింగ్ ఏరియా, విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, సముద్రతీరానికి నేరుగా వెళ్లే ప్రత్యేక మార్గం వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.
ఈ భవనంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి మూడు అంతస్తులను కలుపుతూ నిర్మించిన గాజు ఎలివేటర్. అలాగే ఇంటి ప్రతి అంతస్తు నుంచి అట్లాంటిక్ మహాసముద్రం, మెకాక్స్ బే అందాలను వీక్షించే అవకాశం ఉంది. విశాలమైన గాజు కిటికీలు, సహజ కాంతి, ఆధునిక ఇంటీరియర్ డిజైన్ ఈ ఇంటికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news