గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో ఆర్థిక ఊరట లభించింది. తాండూరు మండలం కరణ్‌కోట గ్రామానికి చెందిన వడ్డె నాగప్ప గుండె సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసరంగా స్టంట్ వేయాల్సి ఉందని, అందుకు సుమారు రూ.2 లక్షలు అవసరమని వైద్యులు సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచి రాజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి వివరించారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.2 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాలను మంజూరు చేశారు. బుధవారం సర్పంచి రాజ్‌కుమార్ ద్వారా ఆ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో నాగప్పకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్స పొందే అవకాశం కలిగింది. క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే స్పందించి సహాయం చేయడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సర్పంచి రాజ్‌కుమార్‌కు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news