రాయలసీమ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నంద్యాల ఎంపీ, తెలుగుదేశం పార్టీ లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఆమె ప్రసంగించారు.
రాయలసీమ ప్రాంతం గతంలో కరవు, వలసలు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహంతో రాయలసీమకు కొత్త అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాయలసీమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆమె అన్నారు. రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన వాతావరణం, విస్తారమైన భూములు ఈ ప్రాంతానికి ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర ఉద్యానవన పంటల సాగులో రాయలసీమ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రంగం ద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఎంపీ వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు విలువ ఆధారిత వ్యవసాయం, కోల్డ్‌చైన్ సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని బైరెడ్డి శబరి తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
గత పాలనలో రాయలసీమ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదని ఎంపీ విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాంతానికి కొత్త రూపు ఇస్తోందని చెప్పారు.
రాయలసీమను ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ పరిశ్రమలకు అనువైన ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని తెలిపారు. పరిశ్రమలతో పాటు రైతులకు మద్దతు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలపడుతుందని డాక్టర్ బైరెడ్డి శబరి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, యువత, పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాయలసీమ రూపురేఖలను మార్చనున్నాయని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news