2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తోంది. మొదటి విడతలో 2025 నవంబర్ 12న 3,00,192 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడతలో భాగంగా మరో 2,50,893 ఇళ్లను ఈరోజు అందజేస్తోంది.

ఈ నేపథ్యంలో నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఓరుగంటాపురం ప్రాంతంలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా తాళాలు అందజేసి వారిని సన్మానించారు.

ఈ పథకం ద్వారా పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు వస్తుందని, సొంత ఇల్లు కలగడం ద్వారా వారి భవిష్యత్తుకు స్థిరత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news