రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన గిరిజన విద్యార్థిని శివాని మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మాటలు విషయం తెలిసినప్పటి నుంచి పదేపదే గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు.
శివాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, సమస్యల నుంచి పారిపోకుండా పోరాడే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు.
“ఎంత కష్టమైనా పోరాడుదాం, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొందాం. మీకు నేనున్నాను, ఈ ప్రభుత్వం ఉంది” అంటూ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దేశ భవిష్యత్తు, సంపద విద్యార్థులేనని పేర్కొంటూ వారికి ధైర్యాన్ని నింపే సందేశాన్ని అందించారు.
ఇటీవల రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో శివాని తన మాటతీరుతో అందరి ప్రశంసలు పొందింది. అలాంటి ప్రతిభావంతమైన విద్యార్థిని అకాల మరణం చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు.
విద్యార్థులు ఒత్తిడి, సమస్యల సమయంలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో తమ భావాలను పంచుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ప్రభుత్వం విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news