ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఓబులాపురంలో దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పత్రిక, టీవీ సంస్థలను ఏర్పాటు చేశారని విమర్శించారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కడప జిల్లాకు జగన్ చేసింది శూన్యమని మంత్రి లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, ఈ నెల 24న తల్లికి వందనం పథకం నిధులను జమ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news