మంగళగిరిలో నిర్వహిస్తున్న ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మంత్రి నారా లోకేష్ సుమారు 6 గంటల పాటు నిరాటంకంగా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మలివిడతలో భాగంగా మొత్తం 2,634 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తొలిరోజు 1,331 మందికి, రెండో రోజు 1,303 మందికి మంత్రి నారా లోకేష్ స్వయంగా పట్టాలు అందించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి, వారి కుటుంబాలతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడం ఆనందాన్ని కలిగించింది. సొంత స్థలం లభించడం ద్వారా భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని లబ్ధిదారులు తెలిపారు.
‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన పొందుతోంది. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుంటూ, వారికి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news