రాష్ట్ర విద్యా వ్యవస్థ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రకాశం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన “షైనింగ్ స్టార్స్-2026” కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు పురస్కారాలు, మెమంటోలు అందజేసి వారి ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులలో పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని ఎమ్మెల్సీ తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. విద్యార్థుల విజయాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా అర్హులైన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.
ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ కుటుంబాలకు, పాఠశాలలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
“షైనింగ్ స్టార్స్-2026” వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రేరణగా నిలుస్తాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు. విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news