మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసిన మంత్రి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి సమస్యలు వంటి పలు అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. అందిన ప్రతి వినతిపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని మంత్రి లోకేష్ ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news