“రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి” ఇంటింటి ప్రచార కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ప్రజలను కలుసుకుంటున్నారు.
23వ డివిజన్ పరిధిలోని 162, 253 బూత్‌లలో మాజీ కార్పొరేటర్, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్, డివిజన్ ఇంచార్జ్ నెల్లిబండ్ల బాలస్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వ విజయాలను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు.
ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చింత దుర్గారావు, కోటి, సూర్య, బూత్ బీఎల్ఏలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news