నైజీరియాలో ప్రభుత్వ వ్యవస్థలో సంచలనం సృష్టించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టబద్ధంగా అసలు ఉనికే లేని ఒక అధ్యక్ష మండలి (Presidential Council) ప్రభుత్వ కార్యాలయాలు, సివిల్ సర్వెంట్లు, అధికారిక వెబ్సైట్, కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో నెలల తరబడి కార్యకలాపాలు నిర్వహించిన విషయం బయటపడింది. ప్రెసిడెన్షియల్ ఫారిన్ ఇంటర్వెన్షన్ ప్రమోషన్ కౌన్సిల్ (PFIPC) పేరుతో పనిచేసిన ఈ సంస్థకు ఎలాంటి చట్టబద్ధ గుర్తింపు లేదని నైజీరియా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. 2025లో ఈ సంస్థ సాధారణ ప్రభుత్వ సంస్థల మాదిరిగానే కార్యకలాపాలు నిర్వహించింది. విదేశీ పెట్టుబడులను నైజీరియాకు ఆకర్షించడం తమ ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తూ రాజధాని అబూజాలోని ఫెడరల్ సెక్రటేరియట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సముదాయంలోనే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పనిచేస్తుండటంతో, ఈ సంస్థ కూడా అధికారిక ప్రభుత్వ సంస్థగానే అందరూ భావించారు. ఈ కౌన్సిల్లో ప్రభుత్వానికి చెందిన శాశ్వత సివిల్ సర్వెంట్లను నియమించారు. ప్రభుత్వ అధికారిక “.gov.ng” డొమైన్లో వెబ్‌సైట్‌ను నిర్వహించింది. ప్రభుత్వ వెబ్సైట్లో ఉండటంతో ప్రజలకు ఇది పూర్తిగా అధికారిక సంస్థగా కనిపించింది. అనంతరం ఆ వెబ్‌సైట్‌ను తొలగించినప్పటికీ, దాని సోషల్ మీడియా ఖాతాలు కొంతకాలం కొనసాగినట్లు సమాచారం.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం కొత్త నియామకాలను నిలిపివేసిన సమయంలో కూడా ఈ కౌన్సిల్‌కు 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతి లభించింది. ఇది ప్రభుత్వ వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. నియామకాల ప్రక్రియ ఎలా జరిగింది, అనుమతులు ఎవరు ఇచ్చారు, ఏ ఆధారంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపై ఇప్పుడు విచారణ కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news