జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారీ పాము ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ పండ్ల బండిలో సుమారు 9 అడుగుల పొడవున్న పాము కనిపించింది. ఉదయం వ్యాపారం నిర్వహిస్తున్న సమయంలో పామును గుర్తించిన వ్యాపారులు, స్థానికులు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.
పండ్ల బండిలో దాక్కున్న పామును బయటకు తీయడం సులభం కాకపోవడంతో సుమారు అరగంట పాటు శ్రమించారు. చివరకు జాగ్రత్తగా పామును అదుపులోకి తీసుకుని సురక్షితంగా బయటకు తీశారు. భారీ పరిమాణంలో ఉన్న పామును చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పామును విజయవంతంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం స్నేక్ క్యాచర్లు దానిని జనావాసాలకు దూరంగా తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news