ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల మొదటి తారీఖు పేదల పండుగగా మారిందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరపున స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ సొమ్మును స్వయంగా అందజేస్తున్నారు.
ఉదయం 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు సమాచారం. లబ్ధిదారులకు సులభంగా, సమయానికి పింఛన్లు అందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. గ్రామస్థాయిలోనే సేవలు అందించడం వల్ల వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారికి పెద్ద ఊరట లభిస్తోంది.
అదే సమయంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎస్సీ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news