రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రామిరెడ్డి గారికి పెన్షన్ అందజేయబడింది. ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు నిర్వహించారు.
ఎల్లో సింగం ప్రతినిధి సి. విజయ్ భాస్కర్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్న లబ్ధిదారులకు కూడా ఇంటివద్దలాగానే సేవలు అందించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలను మరింత సులభంగా ప్రజలకు చేరవేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news