ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాతాని ఉమామహేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది శ్రీమతి మాధవి గారు, మాజీ కౌన్సిలర్ శ్రీమతి జంగా సుజాత గారు, పట్టణ మహిళా కార్యదర్శి శ్రీమతి యాదాల సుజాత గారు, ఇంటూరి నాగేశ్వరరావు గారు, శ్రీ రంగారావు గారు, చి. మహాలక్ష్మమ్మ గారు, శ్రీమతి లక్ష్మీసాంబ్రాజ్యమ్మ గారు, రామారావు గారు, బ్రహ్మచారి గారు, షేక్ సుభాని గారు, కనపర్తి వెంకటేశ్వర్లు గారు, రామయ్య గారు, మంగు అప్పారావు గారు, వెంకట్రామిరెడ్డి గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. సామాజిక భద్రతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news