వానాకాలంలో సాయంత్రం వేళ వేడి వేడిగా, కాస్త కారం రుచితో ఏదైనా తినాలనిపిస్తే పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మంచి ఎంపిక. పల్లెటూర్లలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయ స్నాక్ ఇప్పుడు పట్టణాల్లో కూడా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. వేయించిన పచ్చి శెనగపప్పులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు గుజ్జుతో చేసిన మసాలా మిశ్రమాన్ని కలిపి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు జోడిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. చివరగా నిమ్మరసం చల్లడంతో పులుపు, కారం కలిసిన ప్రత్యేకమైన ఫ్లేవర్ అందుతుంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ స్నాక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సాయంత్రం టీతో పాటు లేదా వర్షాన్ని ఆస్వాదిస్తూ తినేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే సులభంగా తయారయ్యే ఈ పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news